ఈ వీడియోలోని బ్రిటిష్ కాలం నాటి చెట్టుకి కృత్రిమ పదార్థాలతో చేసిన జంతువుల నమూనాలను అమర్చారు CC BY  — 1000 సంవత్సరాల వయసున్న ఒక చెట్టుకి వేర్లకు 101 జంతువుల నమూనాలు ఉన్నాయని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఒక చెట్టు వేర్లు మరియు బెరడుకి అనేక జంతువుల నమూనాలు చెక్కబడి ఉండడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: 1000 సంవత్సరాల వయసున్న చెట్టు వేర్లకి ఉన్న 101 జంతువుల నమూనాలను చూపుతున్న వీడియో. ఫాక్ట్: ఈ చెట్టు [...] The post ఈ వీడియోలోని బ్రిటిష్ కాలం నాటి చెట్టుకి కృత్రిమ పదార్థాలతో చేసిన జంతువుల నమూనాలను అమర్చారు appeared first on FACTLY. ... Factly 14 hr
చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో వరద రోడ్లపై విద్యార్థులు నడుస్తున్న 2023 డిసెంబర్ వీడియోను ఇటీవల... CC BY  — ఇటీవల చెన్నైలో వచ్చిన వరదల కారణంగా సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నీటితో నిండిన రోడ్లపై నడుస్తున్నట్టు వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. అక్టోబర్ 2024లో చెన్నైలో వరదలు సంభవించిన సందర్భంలో ఈ పోస్ట్ షేర్ చేయబడింది. ఈ ఆర్టికల్ ద్వారా ఆ వీడియోలో ఉన్న నిజమెంతో తెలుసుకుందాం. క్లెయిమ్: ఇటీవల అక్టోబర్ 2024లో చెన్నైలో వచ్చిన వరదల కారణంగా సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నీటితో నిండిన రోడ్లపై నడుస్తున్న దృశ్యాల్ని [...] The post చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో వరద రోడ్లపై విద్యార్థులు నడుస్తున్న 2023 డిసెంబర్ వీడియోను ఇటీవలదిగా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 16 hr
ఈ వీడియో కల్తీ పాల తయారీ ప్రక్రియకి సంబంధించినది కాదు CC BY  — ఒక రసాయనాన్ని నీటిలో కలపగా పాలవంటి తెల్లటి ద్రవంగా మారడాన్ని చూపించే వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. రైల్వే స్టేషన్‌లో పాలను ఈ విధంగా కల్తీ చేస్తున్నారంటూ ఈ వీడియోలో చెప్పబడింది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: కల్తీ పాల తయారీ ప్రక్రియని చూపించే వీడియో. ఫాక్ట్: ఫినైల్ ఎమల్సిఫైయర్/కటింగ్ ఆయిల్ అనే తెల్లటి ద్రవాన్ని పొందడానికి టర్కీ రెడ్ ఆయిల్/మినరల్ ఆయిల్‌ను నీటితో [...] The post ఈ వీడియో కల్తీ పాల తయారీ ప్రక్రియకి సంబంధించినది కాదు appeared first on FACTLY. ... Factly 18 hr
భారత్ 1993 తర్వాత IMF నుండి లోన్ తీసుకోలేదు; UNICEF భారతీయ సంస్థల నుండి ఎన్నో ఏళ్లుగా వస్తువులు, సేవ... CC BY  — “1981లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)వద్ద నిధులు కోసం అభ్యర్థించింది, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం UNICEF సంస్థకు వస్తు సేవల రూపంలో సుమారు 6 బిలియన్ డాలర్ల సహాయం అందించింది, UNICEFకు ఆరోగ్యం మరియు రేషన్ మద్దతులో 3వ అతిపెద్ద సరఫరాదారుగా భారత్ అవతరించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత [...] The post భారత్ 1993 తర్వాత IMF నుండి లోన్ తీసుకోలేదు; UNICEF భారతీయ సంస్థల నుండి ఎన్నో ఏళ్లుగా వస్తువులు, సేవలను పొందుతోంది appeared first on FACTLY. ... Factly 1 d
తవ్వకాల్లో బయటపడ్డ కుంభకర్ణుడి కత్తి ఫోటోలు అని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి తయారు చేస... CC BY  — “కుంభకర్ణుడు వాడిన కరవాలం (కత్తి) ఇది నిపుణులు పరిశోధనలో తవ్వకాలలో దొరికింది,”అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పెద్ద కత్తి యొక్క నాలుగు ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతున్నాయి. ఈ కత్తి, రామాయణం కాలం నాటిది అని, ఇది పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది అని చెప్పి నెటిజన్లు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.  క్లెయిమ్: వైరల్ అవుతున్న ఈ [...] The post తవ్వకాల్లో బయటపడ్డ కుంభకర్ణుడి కత్తి ఫోటోలు అని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి తయారు చేసిన ఫోటోలని షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 1 d
సునీతా విలియమ్స్ 2012 స్పేస్ స్టేషన్‌ పర్యటన నాటి వీడియోను ‘ఆమె బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్(2024) ను... CC BY  — 6 జూన్ 2024న, సునీతా విలియమ్స్, విల్మోర్ 10-రోజుల మిషన్ కోసం ISSతో బోయింగ్ స్టార్‌లైనర్‌ను విజయవంతంగా డాక్ చేశారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పర్యటన చేస్తున్న వీడియో ఒకటి “విజయవంతమైన 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ త్వరలో సురక్షితంగా భూమికి చేరుకోనుంది” అంటూ సోషల్ మీడియాలో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథం [...] The post సునీతా విలియమ్స్ 2012 స్పేస్ స్టేషన్‌ పర్యటన నాటి వీడియోను ‘ఆమె బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్(2024) నుండి త్వరలో భూమికి తిరిగి వస్తుంది’ అంటూ షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 2 d
2008 ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్థాన్‌ నుండి టాటా సుమోల ఆర్డర్ వచ్చినా రతన్ టాటా ఒక్క వాహనం కూడా ఇచ... CC BY  — 2008 ముంబై ఉగ్ర దాడులు జరిగిన కొన్ని నెలల తర్వాత, పాకిస్తాన్ కంపెనీలు టాటా సుమో వాహనాలని ఆర్డర్ చేస్తే, పాకిస్థాన్ గడ్డకు ఒక్క వాహనం కూడా రతన్ టాటా పంపించలేదు అని చెప్తున్న పోస్ట్ (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఆ కంపెనీ వాళ్ళు రతన్ టాటాను కలవడానికి ప్రయత్నిస్తే ఆయన స్పందించకపోయే సరికి, వాళ్ళు అప్పటి కాంగ్రెస్ మంత్రి ఆనంద్ శర్మని కలిసారని, ఆనంద్ శర్మ రతన్ [...] The post 2008 ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్థాన్‌ నుండి టాటా సుమోల ఆర్డర్ వచ్చినా రతన్ టాటా ఒక్క వాహనం కూడా ఇచ్చేది లేదని చెప్పారని ఒక పాత పుకారుని మళ్ళీ షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 3 d
గుజరాత్‌లో గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్విన వారిని పోలీసులు కొడుతున్న 2022 వీడియోను ఇటీవలిదిగా తప్ప... CC BY  — గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో గర్బా నృత్యం చేస్తున్న మహిళలపై మసీదు నుండి కొందరు యువకులు రాళ్లు విసరగా, కొందరు మహిళలు గాయపడ్డారని, ఈ ఘటనపై పోలీసులు స్పందించి, ఆ యువకులను ఒక పోల్ కు కట్టి శిక్షిస్తున్నట్లు చెబుతూ వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ సంఘటన 2024లో జరిగినట్టు షేర్ చేస్తున్నారు . ఈ ఆర్టికల్ ద్వారా ఆ వీడియోలో ఉన్న నిజమెంతో తెలుసుకుందాం. క్లెయిమ్: గర్బా డ్యాన్స్ [...] The post గుజరాత్‌లో గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్విన వారిని పోలీసులు కొడుతున్న 2022 వీడియోను ఇటీవలిదిగా తప్పుగా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 3 d
‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఆటో వెనకాల రాసి ఉన్న ఈ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేయబడింద... CC BY  — ‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఒక ఆటో వెనుక రాసి ఉన్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని ఒక ఆటో పైన ఇలా రాసి ఉంది అని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. క్లెయిమ్: ‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఒక కర్ణాటకలోని ఆటో కవర్‌పైన రాసి ఉన్న ఫోటో. ఫ్యాక్ట్(నిజం): ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో. [...] The post ‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఆటో వెనకాల రాసి ఉన్న ఈ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేయబడింది appeared first on FACTLY. ... Factly 3 d
ఈ వీడియోలోని దృశ్యాలు ఇండోనేషియాలో నిర్వహించే మెగెబురాన్ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయానికి సంబంధించిన... CC BY  — “మేఘాలయలోని ఒక్క గ్రామంలో ప్రతి 100 మంది అమ్మాయిలకు 30 మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారు, అందువల్లన అక్కడ అమ్మాయిలు అబ్బాయి నాకు కావాలంటే నాకు కావాలి అని పోటీపడ్డారు, ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్ళి చేస్తారు” అని చెప్తూ ఓ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో అమ్మాయిల గుంపుతో ఒక అబ్బాయి పెనుగులాట మనం [...] The post ఈ వీడియోలోని దృశ్యాలు ఇండోనేషియాలో నిర్వహించే మెగెబురాన్ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయానికి సంబంధించినవి appeared first on FACTLY. ... Factly 1 w
అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించలేదు; ఇజ్రాయెల్ సార్వభౌమాధికారంపై ... CC BY  — “ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం అక్రమ రాజ్యంగా ప్రకటించింది, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌ను సార్వభౌమ రాజ్యంగా గుర్తించకూడదని నిర్ణయించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనికి మద్దుతగా పాలస్తీనా విదేశాంగ మంత్రి అల్-మాలికీ మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. క్లెయిమ్: ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించింది, ప్రపంచంలోని ఏ [...] The post అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్‌ను చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించలేదు; ఇజ్రాయెల్ సార్వభౌమాధికారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు appeared first on FACTLY. ... Factly 1 w
ఒక గేమ్ సిములేషన్ వీడియోను భారతదేశ యుద్ధ విమానం తేజస్ నిజమైన విజువల్స్‌గా షేర్ చేస్తున్నారు CC BY  — ఒక విమానం రన్‌వే నుండి నిలువుగా (వర్టికల్) టేకాఫ్ అయిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇది భారతదేశ యుద్ధ విమానం తేజస్‌ను (ఇక్కడ, మరియు ఇక్కడ) చూపుతున్నదని వాదనలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా వీడియోలో నిజమెంతో తెలుసుకుందాం. క్లెయిమ్: భారతదేశ యుద్ధ విమానం తేజస్ నిలువుగా (వర్టికల్) టేకాఫ్ ని చూపిస్తున్న వీడియో. ఫాక్ట్(నిజం): ఈ వీడియో అసలు నిజమైనది కాదు, ఇంకా తేజస్ విమానాన్ని చూపించడం లేదు. ఇది ఒక [...] The post ఒక గేమ్ సిములేషన్ వీడియోను భారతదేశ యుద్ధ విమానం తేజస్ నిజమైన విజువల్స్‌గా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 1 w
ఈ వీడియో 22 సెప్టెంబర్ 2024న న్యూయార్క్‌లో MIT నిర్వహించిన టెక్ కంపెనీల CEOల సమావేశంలో మోదీ పాల్గొన్... CC BY  — “ప్రపంచ ప్రధాన మంత్రుల భేటీలో మన మోదీ గారు ఎక్కడ కూర్చున్నారు దట్ ఇస్ మోదీ జీ” అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో భారత ప్రధాని మోదీ సమావేశం మధ్యలో కూర్చున్న దృశ్యాలను  మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. క్లెయిమ్: ప్రపంచ ప్రధాన మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తూ భారత ప్రధాని మోదీ అధ్యక్ష కుర్చీలో [...] The post ఈ వీడియో 22 సెప్టెంబర్ 2024న న్యూయార్క్‌లో MIT నిర్వహించిన టెక్ కంపెనీల CEOల సమావేశంలో మోదీ పాల్గొన్న దృశ్యాలను చూపిస్తుంది appeared first on FACTLY. ... Factly 1 w
మధ్య ప్రదేశ్ అహల్యా ఘాట్‌లో నగ్నంగా స్నానం చేసినందుకు యువకులను కొట్టిన సంఘటనను దళితులపై దాడిగా తప్పు... CC BY  — సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ఒక గుంపు అనేక మంది యువకులను నగ్నంగా కొట్టడం కనిపిస్తుంది. పోస్ట్ ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లో కొంతమంది దళితులు గంగా స్నానానికి వెళ్లి దేవాలయ దర్శనం చేసుకోవాలని ప్రయత్నించగా, కొందరు వచ్చి వారిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.  క్లెయిమ్:  ఇది ఉత్తర ప్రదేశ్‌లో కొంతమంది దళితులు గంగా స్నానానికి వెళ్లి దేవాలయాన్ని దర్శించాలనుకుంటే, కొంతమంది [...] The post మధ్య ప్రదేశ్ అహల్యా ఘాట్‌లో నగ్నంగా స్నానం చేసినందుకు యువకులను కొట్టిన సంఘటనను దళితులపై దాడిగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 1 w
ఈ వీడియో 2019లో చైనాలో జరిగిన చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్‌కు సంబంధించినది; ఈ కార్యక్రమంలో హిందూ శ్లోకాలక... CC BY  — “చాలా మంది వ్యక్తులు హిందూ శ్లోకాలు, కీర్తనలు మరియు భగద్గీత శ్లోకాలకు అద్భుతమైన నృత్యం చేశారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం. క్లెయిమ్: చాలా మంది వ్యక్తులు హిందూ శ్లోకాలు, కీర్తనలు మరియు భగవద్గీత శ్లోకాలకు అద్భుతమైన నృత్యం చేస్తున్న దృశ్యాలు. ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 2019లో చైనాలో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా [...] The post ఈ వీడియో 2019లో చైనాలో జరిగిన చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్‌కు సంబంధించినది; ఈ కార్యక్రమంలో హిందూ శ్లోకాలకు నృత్య ప్రదర్శన చేయలేదు appeared first on FACTLY. ... Factly 1 w
03 అక్టోబర్ 2024న కాంగో దేశంలో జరిగిన పడవ ప్రమాద దృశ్యాలను గోవాలో పడవ ప్రమాదం దృశ్యాలని తప్పుగా షేర్... CC BY  — ఇటీవల గోవాలో ఒక పడవ మునిగిపోయింది అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో చాలా మంది ప్రయాణికులతో కూడిన పడవ మునిగిపోవడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం. క్లెయిమ్: ఇటీవల గోవాలో జరిగిన ఒక పడవ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోతో గోవాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 03 [...] The post 03 అక్టోబర్ 2024న కాంగో దేశంలో జరిగిన పడవ ప్రమాద దృశ్యాలను గోవాలో పడవ ప్రమాదం దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 1 w
పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ 20... CC BY  — 07 అక్టోబరు 2023న హమాస్ మెరుపుదాడులతో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య తాజా ఘర్షణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది (ఇక్కడ, ఇక్కడ).  ఈ నేపథ్యంలో,“పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారు” అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. క్లెయిమ్: పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి [...] The post పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ 2023 అర్బయిన్ వాక్ వీడియోను షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 1 w
అప్పటి తూర్పు మరియు పశ్చిమ పాకిస్తాన్ మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించినట... CC BY  — “నాథురాం గాడ్సే గొప్ప దేశభక్తుడు, అప్పటి తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించాడని అందుకే గాడ్సే గాంధీని చంపాడు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. క్లెయిమ్: అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత [...] The post అప్పటి తూర్పు మరియు పశ్చిమ పాకిస్తాన్ మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు appeared first on FACTLY. ... Factly 1 w
గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ గాంధీ కోసం ఏర్పాటు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు CC BY  — గాంధీతో మాట్లాడేందుకు బ్రిటిష్ వారు గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేశారని చెప్తూ గాంధీ ఫోన్లో మాట్లాడుతున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: గాంధీతో నేరుగా మాట్లాడేందుకు బ్రిటిష్ వారు గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేసినప్పటి ఫోటో. ఫాక్ట్: 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావడానికి చాలా సంవత్సరాల ముందుగానే 1897లో [...] The post గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ గాంధీ కోసం ఏర్పాటు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు appeared first on FACTLY. ... Factly 2 w
ఈ వీడియో కేరళలోని ‘మాపిల తెయ్యం’ ఉత్సవాలకు చెందినది; ఇందులో అజాన్ చదవడం ఒక ఆచారం CC BY  — కేరళ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో ముస్లిం మరియు క్రైస్తవ పూజారులను నియమించడం వల్ల వారు హనుమంతుడి చిత్రపటానికి మాంసం వడ్డించి, మద్యం త్రాగించి అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తున్నారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: కేరళ ప్రభుత్వం దేవాలయాల్లో ముస్లిం, క్రైస్తవ పూజారులను నియమించడం కారణంగా వారు హనుమంతుని చిత్రపటానికి మద్యం, మాంసం పెట్టి అల్లాహు [...] The post ఈ వీడియో కేరళలోని ‘మాపిల తెయ్యం’ ఉత్సవాలకు చెందినది; ఇందులో అజాన్ చదవడం ఒక ఆచారం appeared first on FACTLY. ... Factly 2 w
స్టార్(*) గుర్తు ఉన్న రూ. 500 నోట్లు చట్టబద్ధమైనవని; ఇతర నోట్లతో సమానంగా చెల్లుబాటు అవుతాయని RBI స్ప... CC BY  — “సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు దొంగ నోట్లని, అవి చట్టబద్ధం కావని, చెల్లుబాటు కావని” చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. క్లెయిమ్: సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి మరియు చెల్లవు. ఫాక్ట్(నిజం): సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు [...] The post స్టార్(*) గుర్తు ఉన్న రూ. 500 నోట్లు చట్టబద్ధమైనవని; ఇతర నోట్లతో సమానంగా చెల్లుబాటు అవుతాయని RBI స్పష్టం చేసింది appeared first on FACTLY. ... Factly 2 w
చేతిలో నుంచి ఫోన్ లాక్కుందని ఒక పిల్లవాడు తన తిల్లిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన నిజమైన వీడియో అని ఒ... CC BY  — ఒక స్కూలు పిల్లవాడు తన తల్లిని క్రికెట్ బ్యాట్‌తో కొడుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “… అందరూ ఒక్కసారి ఈ వీడియో చూస్తే పిల్లలు ఆండ్రాయిడ్ కి ఎంత అడిక్ట్ అయ్యారో ఎంత ప్రమాదకరం జరిగింది చూడండి తల్లి తండ్రులు జాగ్రత్తగా వుండండి ఇలాంటి పిల్లలు దగ్గర.,” అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం [...] The post చేతిలో నుంచి ఫోన్ లాక్కుందని ఒక పిల్లవాడు తన తిల్లిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన నిజమైన వీడియో అని ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 2 w
తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ... CC BY  — తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వై.వీ. సుబ్బారెడ్డి సహా పలువురు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 30 సెప్టెంబర్ 2024న, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ [...] The post తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఫోటోకు చెప్పుల దండ వేశారు అంటూ సంబంధం లేని పాత ఫోటోను షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 2 w
‘అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్’ ఒక ముస్లిం కుటుంబానికి చెందిన కంపెనీ CC BY  — “దేశంలో అతిపెద్ద భీఫ్ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ పేరు ఆల్ కబీర్, దాని ఓనర్ పేరు శ్రీ సునీల్ కపూర్” అంటూ ఈ కంపెనీ యజమాని హిందూ అని సూచిస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.  క్లెయిమ్: దేశంలో అతిపెద్ద భీఫ్ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ పేరు ఆల్ కబీర్ దాని ఓనర్ పేరు శ్రీ [...] The post ‘అల్ కబీర్ ఎక్స్‌పోర్ట్స్’ ఒక ముస్లిం కుటుంబానికి చెందిన కంపెనీ appeared first on FACTLY. ... Factly 2 w
రాజస్థాన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఒక ఘర్షణ వీడియోని తెలంగాణలో హైడ్రాను వ్యతిరేకిస్తున్న ప్రజల దృ... CC BY  — ‘హైడ్రా ను హడలెత్తిస్తున్న ప్రజలు…. ప్రజల్లో మార్పు మొదలయ్యింది.. ఇక తెలంగాణ నుండి కాంగ్రెస్ ను తరుముడే..’అని చెప్తూ సోషల్ మీడియాలో కొందరు ఒక జేసీబీ మీదకి రాళ్లు విసురుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హైదరాబద్‌లోని పలు భవనాలను హైడ్రా ధ్వంసం చేసిన నేపథ్యంలో(ఇక్కడ మరియు ఇక్కడ) ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. [...] The post రాజస్థాన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఒక ఘర్షణ వీడియోని తెలంగాణలో హైడ్రాను వ్యతిరేకిస్తున్న ప్రజల దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 2 w
చెన్నైలో ఒక తోపుడు బండిని JCB ధ్వంసం చేస్తున్న వీడియోను, తెలంగాణలో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస... CC BY  — ఒక తోపుడు బండిని JCB ధ్వంసం చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలంగాణలో జరిగిన సంఘటన అని సూచిస్తూ ఈ వీడియో పైన ‘Are you Happy mr revanth Reddy? మరీ ఇంత అవసరమా’ అనే టెక్స్ట్ ఉంది. ఇటీవల హైదరాబద్‌లోని పలు భవనాలను హైడ్రా సంస్థ ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.  ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజముందో [...] The post చెన్నైలో ఒక తోపుడు బండిని JCB ధ్వంసం చేస్తున్న వీడియోను, తెలంగాణలో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 2 w
మార్ఫ్ చేసిన ఫోటోను, పతంజలి సంస్థ రాందేవ్ బీఫ్ బిర్యానీ స్పైస్ మిక్స్‌ను అమ్ముతున్నట్టు షేర్ చేస్తున... CC BY  — పతంజలి లోగోతో ఉన్న బీఫ్ బిర్యానీ రెసిపీ మిక్స్ ప్యాకెట్‌ను చూపించే ఫోటోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) యోగా గురువు రాందేవ్ బాబా ఒక పక్క  గోహత్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మరోపక్క బీఫ్ బిర్యానీ అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు అంటూ షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: యోగా గురువు రాందేవ్ బాబా ఒకపక్క  గోహత్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మరోపక్క పతంజలి బీఫ్ [...] The post మార్ఫ్ చేసిన ఫోటోను, పతంజలి సంస్థ రాందేవ్ బీఫ్ బిర్యానీ స్పైస్ మిక్స్‌ను అమ్ముతున్నట్టు షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 2 w
ఈస్ట్(తూర్పు) తిమోర్‌లో తీసిన ఒక వీడియోని మహారాష్ట్రలో జరిగిన AIMIM ర్యాలీ దృశ్యాలు అని తప్పుగా షేర్... CC BY  — “అసదుద్దీన్ ఓవైసి పిలుపుతో మహారాష్ట్రలో ముస్లిమ్స్ ర్యాలీ ఇది. భారతదేశ భవిష్యత్ ఉహించుకోండి,”అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక రోడ్డుపై వెళ్తున్న ఒక భారీ జనసందోహాన్ని మనం చూడవచ్చు. AIMIM ఇటీవల ముంబైలో నిర్వహించిన ‘తిరంగా సంవిధాన్ ర్యాలీ’ నేపథ్యంలో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. క్లెయిమ్: [...] The post ఈస్ట్(తూర్పు) తిమోర్‌లో తీసిన ఒక వీడియోని మహారాష్ట్రలో జరిగిన AIMIM ర్యాలీ దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 2 w
ఇటీవల బెంగళూరులో జరిగిన మహిళ హత్య సంఘటనను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు CC BY  — “హిందూ మహిళను ఆమె ముస్లిం బాయ్‌ఫ్రెండ్ హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి, ఫ్రిజ్‌లో ఉంచాడు” అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ పోస్టు ఇటీవల బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి అనే మహిళ హత్య కేసు నేపథ్యంలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ శరీరాన్ని ముక్కలుగా [...] The post ఇటీవల బెంగళూరులో జరిగిన మహిళ హత్య సంఘటనను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 2 w
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం ఇంకా లభించలేదు CC BY  — ఇటీవల, 23 సెప్టెంబర్ 2024న, న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) నిర్వహించిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో, ఐక్యరాజ్యసమితి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వంటి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు తీసుకురావాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ శాశ్వత సభ్యత్వం మరియు వీటో (veto power) అధికారాన్ని పొందిందని పేర్కొంటూ పలు పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ). ఈ [...] The post ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం ఇంకా లభించలేదు appeared first on FACTLY. ... Factly 2 w
వైసీపీ నేత రోజా తన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌ను తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో విమర్శించారని ఒక ఎ... CC BY  — “అధికారం పోయేసరికి ప్లేట్ తిప్పేసిన రోజా..” అని చెప్తూ తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో నగరి మాజీ MLA, వైసీపీ నేత RK రోజా తన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశారని క్లెయిమ్ చేస్తున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తను జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం మనం చూడవచ్చు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.  క్లెయిమ్: [...] The post వైసీపీ నేత రోజా తన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌ను తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో విమర్శించారని ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 3 w
సంబంధం లేని పాత ఫోటోను తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు కలిసినందుకు కొంతమంది శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్... CC BY  — లడ్డూకు వినియోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని తెలిసిన తర్వాత శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్రోక్షణ చేసుకుంటున్న సనాతన సోదరులు అంటూ కొంతమంది ఆవు పేడను తమ ఒంటికి రాసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: లడ్డూకు వినియోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని తెలిసిన తర్వాత కొంతమంది శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్రోక్షణ చేసుకుంటున్న ఫోటో.  ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో అహ్మదాబాద్ శివార్లలోని [...] The post సంబంధం లేని పాత ఫోటోను తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు కలిసినందుకు కొంతమంది శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్రోక్షణ చేసుకుంటున్న ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 3 w
“తన సోదరిపై అత్యాచారం చేసిన వ్యక్తిని చంపిన తర్వాత లవ్‌ప్రీత్ సింగ్ నవ్వుతున్న వీడియో” అంటూ సంబంధం ల... CC BY  — పోలీసులు తీసుకెళ్తుండగా ఓ యువకుడు నవ్వుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో ఉన్న యువకుడి పేరు లవ్‌ప్రీత్ అని, అతని సోదరిపై అత్యాచారం చేసినందుకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన అక్బర్ అనే వ్యక్తిని చంపినందుకు అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు రాస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: లవ్‌ప్రీత్ సోదరిపై అత్యాచారం చేసినందుకు [...] The post “తన సోదరిపై అత్యాచారం చేసిన వ్యక్తిని చంపిన తర్వాత లవ్‌ప్రీత్ సింగ్ నవ్వుతున్న వీడియో” అంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 3 w
“జై శ్రీరామ్” నినాదం చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ క్షమాపణలు చెప్పారని ఈ వీడియోలో చేస్తున్న... CC BY  — “ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా శ్రీరామ్ కాలనీకి వెళ్లినప్పుడు,ఆమె జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించగానే, అక్కడ కూర్చున్న ముస్లింలు వెంటనే మీరు జై శ్రీరామ్ ఎందుకు అన్నారంటూ హంగామా చేశారు” అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా మాట్లాడుతున్నప్పుడు కొందరు వ్యక్తులు గొడవ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: ఢిల్లీలోని [...] The post “జై శ్రీరామ్” నినాదం చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ క్షమాపణలు చెప్పారని ఈ వీడియోలో చేస్తున్న వాదన ఫేక్ appeared first on FACTLY. ... Factly 3 w
ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురిని పెళ్లి చేసుకున్న నిజమైన సంఘటన అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోన... CC BY  — ‘రారండోయ్ తండ్రి బిడ్డల పెండ్లి చూద్దాం’ అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురిని పెళ్లి కొన్నాడు అని క్లెయిమ్ చేస్తున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి వైరల్ అవుతోంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొని వెళ్తుండగా వాళ్లని ఒకతను ప్రశ్నిస్తూ ఈ వీడియోని తీసినట్లు కనిపిస్తుంది. అసలు దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో  ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతుర్ని [...] The post ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురిని పెళ్లి చేసుకున్న నిజమైన సంఘటన అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 3 w
తమిళనాడు పర్యావరణ కార్యకర్త పీయూష్ మనుష్‌పై దాడికి సంబంధించిన పాత వీడియోను ఇప్పుడు తప్పుడు కథనంతో షే... CC BY  — “తిరుపతి నుంచి వేంకటేశ్వర స్వామి స్వయంగా గొడ్డు మాంసంతో చేసిన లడ్డు తన భక్తులకు పంపాడు అని వీడియో చేసినందుకు స్థానిక హిందూ యువకులు అతనిపై దాడి చేసారు” అంటూ కొంతమంది పియూష్ మనుష్/పియూష్ సేథియాను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: తిరుపతి నుంచి వేంకటేశ్వర స్వామి స్వయంగా గొడ్డు మాంసంతో చేసిన లడ్డు [...] The post తమిళనాడు పర్యావరణ కార్యకర్త పీయూష్ మనుష్‌పై దాడికి సంబంధించిన పాత వీడియోను ఇప్పుడు తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 3 w
కర్ణాటకలోని చిక్కోడిలో పాకిస్తాన్ జెండాలను ఎగురవేశారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియోలో కనిపిస్తున్నవి ఇస్... CC BY  — కర్ణాటకలోని చిక్కోడి పట్టణంలో రోడ్డు మధ్యలోని వీధిలైట్ల స్తంభాలకు పాకిస్తాన్ జెండాలను కట్టారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: కర్ణాటకలోని చిక్కోడిలోని వీధిలైట్ల స్తంభాలకు పాకిస్థాన్ జెండాలను కట్టిన దృశ్యాలు. ఫాక్ట్: వీడియోలో కనిపిస్తున్నవి పాకిస్తాన్ జెండాలు కావు. అవి ఇస్లామిక్ జెండాలు. మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా అనుమతి తీసుకొని స్థానికులు ఈ జెండాలను ఏర్పాటు చేశారని చిక్కోడి [...] The post కర్ణాటకలోని చిక్కోడిలో పాకిస్తాన్ జెండాలను ఎగురవేశారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియోలో కనిపిస్తున్నవి ఇస్లామిక్ జెండాలు appeared first on FACTLY. ... Factly 3 w
పాకిస్థాన్‌కు చెందిన ఫుడ్ రిటైలర్ ఉద్యోగుల పేర్లు చూపిస్తున్న ఎడిట్ చేసిన స్క్రీన్‌ షాట్‌ను టీటీడీకి... CC BY  — తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేసే A.R డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లింల ఆధ్వర్యంలో నడుస్తోంది అంటూ AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ పాకిస్తాన్‌కు చెందిన సంస్థ అని తెలిపే ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేసే A.R డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లింల ఆధ్వర్యంలో నడుస్తోంది.  [...] The post పాకిస్థాన్‌కు చెందిన ఫుడ్ రిటైలర్ ఉద్యోగుల పేర్లు చూపిస్తున్న ఎడిట్ చేసిన స్క్రీన్‌ షాట్‌ను టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన సంస్థకు సంబంధించిందిగా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 3 w
వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి బైబిల్ పట్టుకుని ఉన్న ఫోటోని తప్పుదోవ పట్టించే కథనంతో షేర్ చ... CC BY  — తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి బైబిల్ పట్టుకుని ఉన్న ఫోటోతో కూడిన గ్రాఫిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవిడ బైబిల్ లేకుండా బయటకు కూడా రారు అని, తను క్రైస్తవ మతాన్ని నమ్ముతారు అని అర్థం వచ్చేలాగా క్లెయిమ్ చేస్తూ దీన్ని షేర్ చేస్తున్నారు. ఇదే ఫొటోలో వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు తన తల్లి వై.ఎస్. విజయమ్మ కూడా ఉన్నారు ఇటీవల [...] The post వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి బైబిల్ పట్టుకుని ఉన్న ఫోటోని తప్పుదోవ పట్టించే కథనంతో షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 3 w
పేజర్, వాకీటాకీల తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్‌లో గొర్రెలను పేల్చింది అని చెప్పి వ్యంగ్యం కోసం చే... CC BY  — లెబనాన్ దేశానికి చెందిన మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా గ్రూప్‌పై ఇజ్రాయెల్ ఇటీవల చేసిన దాడుల నేపథ్యంలో, పేజర్లు, వాకిటాకీల (ఇక్కడ మరియు ఇక్కడ) తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ గొర్రెలను పేల్చి హిజ్బుల్లాను టార్గెట్ చేస్తుంది అని క్లెయిమ్ చేస్తూ, ప్రముఖ మీడియా సంస్థ CNN వారి ఒక వీడియో రిపోర్టుని (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: పేజర్, వాకీటాకీ తర్వాత [...] The post పేజర్, వాకీటాకీల తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్‌లో గొర్రెలను పేల్చింది అని చెప్పి వ్యంగ్యం కోసం చేసిన ఒక కథనాన్ని షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 3 w
19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్ల... CC BY  — “19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొందరు ముస్లిం దుండగులు నిప్పు పెట్టారు” అంటూ ఓ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). డీజే సౌండ్ బాక్సులు ఉన్న వాహనం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. క్లెయిమ్: 19 [...] The post 19 సెప్టెంబర్ 2024న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ముస్లింలు నిప్పు పెట్టారాని పేర్కొంటున్న పోస్ట్‌లు ఫేక్ appeared first on FACTLY. ... Factly 3 w
నాటకంలోని ముస్లిం పాత్రదారుడిపై జరిగిన దాడిని తప్పుడు మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు CC BY  — హిందువులందరినీ ముస్లింలుగా మారుస్తానని వేదికపై ఒక ముస్లిం వ్యక్తి మాట్లాడుతుండగా, వెనక నుంచి వచ్చిన మరో వ్యక్తి అతనిపై దాడి చేశాడంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: హిందువులందరినీ ముస్లింలుగా మారుస్తానని ఒక ముస్లిం వ్యక్తి చెప్పగానే అతనిపై మరో వ్యక్తి దాడి చేసిన దృశ్యాలు. ఫాక్ట్: మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన 10 సెప్టెంబర్ 2024లో ఒడిశాలోని [...] The post నాటకంలోని ముస్లిం పాత్రదారుడిపై జరిగిన దాడిని తప్పుడు మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 4 w
ఉత్తర్ ప్రదెశ్‌కి చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ వీడియోని మతపరమైన తప్పుదోవ పట్టించే సమాచారంతో షేర్ చేస్... CC BY  — హిందువుల్ని ఎలా చంపాలో ట్రైనింగ్ అవుతున్న యూపీకి చెందిన ఒక ముస్లిం వ్యక్తి వీడియో(ఇక్కడ, ఇక్కడ) అని చెప్పి ముస్లిం వేషధారణలో ఒకతను ఒక బొమ్మని కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.  క్లెయిమ్: హిందువుల్ని ఎలా చంపాలో ట్రైనింగ్ అవుతున్న యూపీకి చెందిన ఒక ముస్లిం వ్యక్తి వీడియో.  ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక మార్షల్ ఆర్టిస్ట్ మరియు మార్షల్ [...] The post ఉత్తర్ ప్రదెశ్‌కి చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ వీడియోని మతపరమైన తప్పుదోవ పట్టించే సమాచారంతో షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 4 w
అల్లం, వెల్లుల్లి, తేనె, నిమ్మరసం కలిపి తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎ... CC BY  — నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని, ఫలితంగా యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ అవసరం ఉండదని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ అవసరం లేకుండా నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాగితే గుండె నాళాల్లోని [...] The post అల్లం, వెల్లుల్లి, తేనె, నిమ్మరసం కలిపి తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు appeared first on FACTLY. ... Factly 4 w
చైనాకు సంబంధించిన పాత ఫోటోని శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో అ... CC BY  — శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో అంటూ కొంతమంది డాక్టర్లు ఒక మృతదేహం ముందు తమ తలలు వంచి నిలబడ్డ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చెయ్యబడుతోంది. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.  క్లెయిమ్: ఇది శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో. ఫాక్ట్ (నిజం): ఇది శరీర దానం చేసిన [...] The post చైనాకు సంబంధించిన పాత ఫోటోని శరీర దానం చేసిన సీతారాం ఏచూరికి డాక్టర్లు గౌరవ వందనం తెలుపుతున్న ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు appeared first on FACTLY. ... Factly 4 w
ఏనుగు పోలికలతో ఒక మానవ శిశువు ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించింది అని చెప్తూ ఒక AI జనరేటెడ్ వీడియోని షేర్ చ... CC BY  — ఏనుగు వంటి తొండం మరియు చెవులతో ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక శిశువు జన్మించింది అని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. క్లెయిమ్: ఏనుగు పోలికలతో ఒక మానవ శిశువు ఆంధ్ర ప్రదేశ్లో జన్మించింది ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని మోరోకో దేశానికి చెందిన ‘Ali Aboutine’ అనే AI ఆర్టిస్ట్ [...] The post ఏనుగు పోలికలతో ఒక మానవ శిశువు ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించింది అని చెప్తూ ఒక AI జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 4 w
పది నిమిషాలకు ఒకసారి రూపాంతరం చెందే వింత జీవి యొక్క దృశ్యాలు అని చెప్తూ ఒక AI జనరేటెడ్ వీడియోని షేర్... CC BY  — పది నిమిషాలకు ఒకసారి రూపాంతరం చెందే జీవి యొక్క ఫౌండ్ ఫుటేజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బ్రహ్మంగారు చెప్పింది ఏది తప్పదు, ఇది ఏలియన్ అనుకుంట..! cc tv కి దొరికిన విడియో’ అని చెప్తూ షేర్ చేస్తున్న ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. క్లెయిమ్: పది నిమిషాలకు ఒకసారి రూపం మార్చుకుంటున్న వింత జీవి యొక్క సీసీ టీవీ ఫుటేజ్. ఫ్యాక్ట్(నిజం): ఇది [...] The post పది నిమిషాలకు ఒకసారి రూపాంతరం చెందే వింత జీవి యొక్క దృశ్యాలు అని చెప్తూ ఒక AI జనరేటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు. appeared first on FACTLY. ... Factly 4 w
ఈ వీడియో కాన్పూర్‌లో అవినీతి ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన సంఘటనకి సంబంధించింది CC BY  — “ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీఎస్పీగా పనిచేసిన షానవాజ్ ఖాన్, పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో లక్షన్నర రూపాయలు మరియు అక్రమ ఆయుధాలను తన స్నేహితులకు అందజేస్తు అవినీతి నిరోధక టీమ్‌కి పట్టుబడ్డాడు.” అంటూ ఒక పోలీసును కొందరు వ్యక్తులు రోడ్డుపై తీసుకొని వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చెయ్యబడుతుంది. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీఎస్పీగా పనిచేసిన షానవాజ్ ఖాన్, [...] The post ఈ వీడియో కాన్పూర్‌లో అవినీతి ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన సంఘటనకి సంబంధించింది appeared first on FACTLY. ... Factly 4 w
ఈ వీడియో నూడిల్ తయారీ ప్రక్రియకు సంబంధించి కాదు, సబ్బు తయారీకి సంబంధించింది CC BY  — నూడుల్స్ ఉత్పత్తికి సంబంధించిన విజువల్స్‌ను చూపుతున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒక వీడియో షేర్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజమేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. క్లెయిమ్: ఈ వీడియో నూడుల్స్ ఉత్పత్తికి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఫాక్ట్(నిజం): ఈ వీడియో నూడిల్ తయారీ ప్రక్రియకు సంబంధించి కాదు. ఈ వీడియో సబ్బు తయారీ దృశ్యాలను చూపిస్తుంది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు. వైరల్  వీడియో యొక్క కీ [...] The post ఈ వీడియో నూడిల్ తయారీ ప్రక్రియకు సంబంధించి కాదు, సబ్బు తయారీకి సంబంధించింది appeared first on FACTLY. ... Factly 4 w